Sep 18, 2026, 10:09 IST/
30% కంటే ఎక్కువగా క్రెడిట్ కార్డు వాడుతున్నారా? నిపుణుల సూచనలివే
Sep 18, 2026, 10:09 IST
క్రెడిట్ కార్డులోని మొత్తం పరిమితిలో 30% మాత్రమే వాడాలని ఆర్థిక నిపుణుల సూచిస్తుంటారు. ఒకే కార్డుపై తరచుగా పరిమితికి మించి ఖర్చు చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. ఇది బ్యాంకుల దృష్టిలో అప్పులపైనే ఎక్కువ ఆధారపడుతున్నారనే సంకేతాలను పంపుతుంది. తద్వారా కొత్త రుణాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. బహుళ క్రెడిట్ కార్డులను ఉపయోగించడం, అధిక క్రెడిట్ పరిమితి కోసం అభ్యర్థించడం ద్వారా క్రెడిట్ స్కోర్ను మెరుగుపరచుకోవచ్చు.