Sep 15, 2026, 13:09 IST/
రూ.2,000 పైన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు ఖరారు
Sep 15, 2026, 13:09 IST
రూ.2,000 పైన చేసే UPI లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 15 నుండి అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం, వ్యాపారులకు వ్యక్తులు చేసే ట్రాన్సాక్షన్పై 0.4% ఛార్జీ వర్తిస్తుంది. రూ.75వేలు, ఆ పైన జరిగే లావాదేవీలకు గరిష్ఠంగా రూ.300 ఛార్జీ వర్తించనుంది. అయితే, పర్సన్ టు పర్సన్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ ఉచితంగానే కొనసాగుతాయి.