Sep 02, 2026, 10:09 IST/
నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల క్షేత్రస్థాయి పరిశీలన
Sep 02, 2026, 10:09 IST
హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. లాటరీలో ఎంపికైన లబ్ధిదారుల అర్హతలను పరిశీలించేందుకు అధికారులు బుధవారం నుంచి ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనున్నారు. ఆగస్టు 28 నుంచి 31 వరకు నిర్వహించిన లాటరీలో ఎంపికైన లబ్ధిదారుల వివరాలను https://tghb.telangana.gov.in/allotmentobjection పోర్టల్లో అందుబాటులో ఉంచారు. నాలుగు రోజుల్లో పరిశీలన ప్రక్రియ ముగియనుంది. అర్హత లేనివారిని తొలగించి, వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు.