Sep 27, 2026, 17:09 IST/మానకొండూర్
మానకొండూర్
బండి సదయ్య కుటుంబానికి బాల్య మిత్రుల చేయూత
Sep 27, 2026, 17:09 IST
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన బండి సదయ్య ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందగా 1985-86 ఏడో తరగతి బాల్యమిత్రులు ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం నింపారు. మిత్రులంతా కలిసి సుమారు రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని అందజేసి అండగా నిలిచారు.