
మహిళల హఠాన్మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసిన టీడీపీ నాయకులు
పాలకొండ మండలం (అవలంగి - వెంకటాపురం) వెంకటాపురం గ్రామంలో పొలంలో పనులు చేస్తుండగా అకస్మాత్ గా పడిన పిడుగుపాటుకు ఇద్దరు మహిళా వ్యవసాయ కూలీలు ఘటనా స్థలంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే టీడీపీ ఇంఛార్జ్ పడాల భూదేవి స్థానిక తహశీల్దార్ కి , స్థానిక టీడీపీ నాయకులకు వెళ్లి దగ్గర ఉండి సహాయక చర్యలు చేసి కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. పార్టీ పెద్దలతో విషయాన్ని వెంటనే తెలియపరచి అన్నీ విధాల కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. ఇద్దరు మహిళలు మృతి చెందడంతో టీడీపీ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.























