
భారీ వర్షాల వలన క్విజ్ పోటీలు వాయిదా
శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి సిరిపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నాడు జరగాల్సిన జిల్లా స్థాయి క్విజ్ పోటీలు భారీ వర్షాల వలన వాయిదా పడినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నగరి తారకేశ్వరరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. తదుపరి నిర్వహణ తేదీని త్వరలో తెలియజేస్తామన్నారు.























