
కృష్ణాపురంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం
కొత్తూరు మండలం, మెట్టూరు బిట్–1, కృష్ణాపురంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జై భీమ్ క్రేజీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ గణేశుని నామస్మరణతో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు, గ్రామస్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన దాతలు, గ్రామస్తులు, యువతకు జై భీమ్ క్రేజీ బాయ్స్ యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.




















