Oct 15, 2026, 16:10 IST/
ఎస్బీఐ పీవో మెయిన్స్ ఫలితాలు విడుదల
Oct 15, 2026, 16:10 IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)-2026 మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 1,500 పోస్టుల భర్తీకి గత జూన్లో నోటిఫికేషన్ జారీ చేయగా, ఆగస్టులో ప్రిలిమ్స్ నిర్వహించారు. అందులో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 12న మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. తాజాగా ఫలితాలను ప్రకటించారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు మూడో దశ సైకోమెట్రిక్ పరీక్ష అక్టోబర్ 31న జరగనుంది. అభ్యర్థులు ఫలితాలను ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో పరిశీలించవచ్చు.