Sep 22, 2026, 13:09 IST/
ఈ జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు
Sep 22, 2026, 13:09 IST
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో బుధవారం స్కూళ్లకు సెలవు ఉండనుంది. ఉత్తరాంధ్రలో అతిభారీ వర్షాల కారణంగా అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అధికారులు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. మరోవైపు తెలంగాణలో నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో వినాయక నిమజ్జనాల నేపథ్యంలో హాలిడే ఇచ్చారు. దీనికి బదులుగా NOV 14న (రెండో శనివారం) విద్యాసంస్థలు యథావిధిగా పనిచేస్తాయని కలెక్టర్లు తెలిపారు.