Sep 14, 2026, 06:09 IST/
త్వరలో ఆర్బీఐ రెపో రేట్ల పెంపు..పెరగనున్న ఈఎంఐలు
Sep 14, 2026, 06:09 IST
ఆర్బీఐ త్వరలోనే రెపో రేటును పెంచేందుకు సిద్ధమవుతోందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం, రూపాయి విలువను స్థిరీకరించడం కోసం రానున్న అక్టోబర్, డిసెంబర్ సమీక్షల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున మొత్తం 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం రెపో రేటు 5.25%గా ఉంది. ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచితే లోన్లు తీసుకున్నవారిపై ఈఎంఐ (EMI) భారం పెరుగుతుంది. అయితే ఫిక్స్డ్ డిపాజిట్లు (FD) ఉన్నవారికి మాత్రం అధిక వడ్డీ ద్వారా ప్రయోజనం కలుగుతుంది.