టెక్కలి - Tekkali

అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు.. మంత్రి ఆదేశాలున్నా అమలు శూన్యం

అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు.. మంత్రి ఆదేశాలున్నా అమలు శూన్యం

శ్రీకాకుళం జిల్లా టెక్కలి డివిజన్‌లో ప్రభుత్వ కార్యాలయాలు ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కింజరాపు అచ్చం నాయుడు పాత జిల్లా ఆసుపత్రిని కేంద్రంగా అన్ని కార్యాలయాలను ఒకే చోట ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినా, నేటికీ అది అమలు కాలేదు. దీంతో ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అద్దెల రూపంలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని, ఇకనైనా అధికారులు స్పందించి కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

వీడియోలు


కరీంనగర్ జిల్లా
Top 10 viral news 🔥
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!
Sep 30, 2026, 17:09 IST/

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!

Sep 30, 2026, 17:09 IST
దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) పెంపుపై చర్చలు ఊపందుకున్నాయి. ఉద్యోగ సంఘాలు బోనస్ లెక్కింపు సీలింగ్‌ను రూ.7,000 నుండి రూ.21,000కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, ఉద్యోగులకు రూ.20,724 వరకు అదనంగా లభించే అవకాశం ఉంది. అక్టోబర్ మొదటి వారంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే, కొన్ని విభాగాల్లో రోజులు తగ్గించి బోనస్ ఇవ్వడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.