
జొమాటో మరో షాక్.. క్యాష్ ఆన్ డెలివరీపై ఫీజు!
జొమాటో క్యాష్ ఆన్ డెలివరీ (COD) ఆర్డర్లపై రూ. 5 అదనపు ఛార్జీ వసూలు చేయడం ప్రారంభించింది. ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు వినియోగదారులను డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెస్టారెంట్ ప్యాకేజింగ్, జీఎస్టీ వసూలు చేస్తున్న జొమాటో.. ఇటీవల తన ప్లాట్‌ఫామ్ ఫీజును ఒక్కో ఆర్డర్‌పై రూ. 12.50 నుంచి రూ. 14.90కి పెంచింది. ఫుడ్ డెలివరీ రంగంలో పోటీ తీవ్రమవుతున్న నేపథ్యంలో, లాభదాయకతను కాపాడుకునేందుకు జొమాటో ఈ అదనపు భారాన్ని మోపినట్లు తెలుస్తోంది.




