
పోలీసుల త్యాగాలు మరువలేనివి
పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఆముదాలవలసలోని సూర్య స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ పూజారి రమణమూర్తి ప్రజా రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం అర్పించిన పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ప్రజల రక్షణే పరమావధిగా అహర్నిశలు పనిచేసే పోలీసుల త్యాగం, అంకితభావం చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. పోలీస్ వృత్తి అత్యంత గౌరవప్రదమైనదని, వారి సేవలకు శతకోటి వందనాలని ఆయన పేర్కొన్నారు.
































