
ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన
రణస్థలం మండలం సీతంవలస గ్రామంలో ఉద్యానశాఖ, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా హార్టికల్చర్ ఆఫీసర్ టి. అమరేశ్వరి మాట్లాడుతూ ఆయిల్‌పామ్ దీర్ఘకాలిక ఆదాయాన్ని అందించే ముఖ్యమైన పంట అని, రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న మొక్కలపై 100 శాతం, డ్రిప్‌పై 90 శాతం, యంత్ర పరికరాలపై 50 శాతం రాయితీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పతంజలి సంస్థ మేనేజర్ తోట గురు సాగు పద్ధతులను వివరించారు. ఉత్తమ రైతు భుజంగ రావు తన అనుభవాలను పంచుకున్నారు.

























