
ఆముదాలవలసలో ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని దివంజీపేట మరియు కుమ్మరిపేట గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లొద్దలపేట సూర్య వాలంటరీ అధ్యక్షులు పూజారి రమణ మూర్తి పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రశంసించారు. అలాగే సూర్య సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.






















