
ప్రమాద బాధితుడికి ఆర్థిక సాయం అందజేత
శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని వజ్రపుకొత్తూరు మండలం పెద్ద అంగవానిపేట గ్రామానికి చెందిన అంగ ధర్మారావు ఇటీవలి బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న బాధితుడిని ఆదుకునేందుకు గురువారం పుడిజగన్నాధపురంకు చెందిన హాండ్స్ టుగేధర్ సంస్థ వారు 21 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా దాతలు మరికొంతమంది ముందుకు వచ్చి బాధితుడికి చేయూతనివ్వాలని కోరారు. కార్యక్రమంలో పలువురు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.




















