
జోరుగా సాగిన కూటమి ఎంపీటీసీ అభ్యర్థి మాధవరావు ఎన్నికల ప్రచారం
పాతపట్నం నియోజకవర్గంలోని ఆకులతంపర, కాలనీ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి అగతముడి మాధవరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలను కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధి అంశాలపై చర్చించిన మాధవరావు మాట్లాడుతూ, సంపూర్ణ సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు మద్దతు తెలిపారు.






















