నేటి నుంచి రాష్ట్ర పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌

39చూసినవారు
నేటి నుంచి రాష్ట్ర పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌
AP: మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న రాష్ట్ర పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ మంగళవారం ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ఈ క్రీడా పోటీలను ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీసు రేంజ్‌లు, యూనిట్ల నుంచి సుమారు 1,900 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. విట్‌ ఏపీ వర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ వేదికలుగా నేటి నుంచి ఈ నెల 4 వరకు ఈ పోలీసు క్రీడా పోటీలు జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్