ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు 10 శాతం, పీజీ విద్యార్థులకు 5 శాతం, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు 3.5 శాతం స్టైఫండ్ పెంచారు. ఈ పెంపుతో ప్రభుత్వానికి అదనంగా రూ.34.08 కోట్ల భారం పడనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు 1.1.2026 నుండి రూ.28,497 స్టైఫండ్గా పెంచనున్నారు.