AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామంలో ఇద్దరు టీడీపీ నేతలపై దాడిచేసి వైసీపీ నాయకులు తాడిపత్రికి వచ్చారు. పెద్దారెడ్డి ఇంటి వద్ద టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య పరస్పర రాళ్ల దాడులకు పాల్పడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు.