తుఫాన్: ఎగసి పడుతున్న అలలు.. ముందుకొచ్చిన సముద్రం

17చూసినవారు
AP: అర్నబ్ తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. బందరు, పాలకాయతిప్ప వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారి, దాదాపు 1000 మీటర్ల మేర ముందుకు వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. 6 నుంచి 7 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడుతుండటంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్