AP: కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి
జనసేన పార్టీలో అధికారికంగా చేరారు. మధ్యాహ్నం విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో సుకుమార్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కావలి పట్టణంలో సుకుమార్ రెడ్డి అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.