AP: కడప నగర శివారులోని కేఎస్ఆర్ఎమ్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ఉన్న నారాయణ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మదన్ మోహన్ రెడ్డి (15) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. నారాయణ స్కూల్‌లో ఉపాధ్యాయుల ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మదన్ మోహన్ మృతదేహాన్ని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.