సహాయక చర్యలు చేపట్టండి: సీఎం చంద్రబాబు

9చూసినవారు
సహాయక చర్యలు చేపట్టండి: సీఎం చంద్రబాబు
అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు సీఎంకు నివేదించారు. తుపాను తీవ్రతతో కొన్నిచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని, భద్రతా కారణాల దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశామని వారు వివరించారు.

సంబంధిత పోస్ట్