జనసేనకు 4 జెడ్పీ చైర్మన్లతోనే సరిపెట్టిన టీడీపీ

3చూసినవారు
జనసేనకు 4 జెడ్పీ చైర్మన్లతోనే సరిపెట్టిన టీడీపీ
ఏపీలో జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల పంపకంలో మిత్రపక్షమైన జనసేనకు టీడీపీ ఘోర పరాభవాన్ని మిగిల్చింది. మొత్తం 28 జెడ్పీలలో జనసేన 9 స్థానాలను డిమాండ్ చేయగా, టీడీపీ కేవలం 4 స్థానాలకే పరిమితం చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలను మాత్రమే జనసేనకు కేటాయించారు. మిగిలిన 22 స్థానాలు టీడీపీకి, 1 బీజేపీకి దక్కాయి. జెడ్పీ వైస్ ఛైర్మన్ పదవుల్లోనూ జనసేనకు 5 మాత్రమే దక్కాయి. టీడీపీ నాయకత్వం తమ డిమాండ్లను ఖాతరు చేయకపోవడంతో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్