AP: గుంటూరు జిల్లా జడవల్లి ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో TDP అభ్యర్థి మిక్కిలి శ్రావణి 74 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అదేవిధంగా మన్యం జిల్లా సాలూరు మండలం గంజాయిభద్రలో కూడా TDP అభ్యర్థి
చిరంజీవి గెలుపొందారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో TDP అభ్యర్థులు తమ ఆధిక్యతను చాటుకున్నారు. ఈ
ఫలితాలు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపాయి. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక విజేతలను అధికారులు అధికారికంగా ప్రకటించారు.