AP: అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక టీడీపీకి చెందిన పలు కుటుంబాలు ఆ పార్టీని వీడి అధికార వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీలో చేరాయి. పార్టీ నాయకత్వ తీరు పట్ల అసంతృప్తితోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ చేరికతో కదిరి రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఈ చేరికలు తోడ్పడతాయని స్థానిక
వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.