జగన్‌పై టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు విమర్శలు

29చూసినవారు
జగన్‌పై టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు విమర్శలు
AP: షర్మిల వివాహ ఆహ్వాన పత్రిక విషయంలో జగన్‌ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు విమర్శించారు. సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆస్తుల వివాదాలను రాజకీయాలకు వాడుకుంటూ, సాక్షి మీడియాను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్