AP: ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట సామాజిక కార్యకర్త, మహిళా అడ్వకేట్ స్వర్ణలతపై
టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తనను జుట్టు పట్టుకుని ఈడ్చి, ముఖంపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. ఏలూరు షాడో ఎమ్మెల్యే కంప్యూటర్ ప్రసాద్ అక్రమాలను ప్రశ్నించినందునే తనపై ఈ దాడి జరిగిందని బాధితురాలు పేర్కొన్నారు. గతంలో కూడా తనపై దాడులు జరిగాయని, పోలీసులు ఫిర్యాదులపై స్పందించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.