16 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ

10చూసినవారు
16 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ
ఏపీలోని వివిధ జిల్లాల్లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ తన పట్టును నిరూపించుకుంది. చీపురుగూడెం, గుంటూరు జిల్లాలో ఐదు, సాలూరు మండలంలో రెండు, ఆమంచర్లలో రెండు, పాలెంకోట, కడప జిల్లా దమ్మనపల్లి, అనంతపురం జిల్లా వీరుపాపురం, నంద్యాల జిల్లా జినపల్లె, నందమూరు ఎంపీటీసీ స్థానాలను టీడీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో టీడీపీ అభ్యర్థి 125 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాకినాడ జిల్లా రామచంద్రాపురం ఎంపీటీసీ స్థానాన్ని జనసేన పార్టీ దక్కించుకుంది.

సంబంధిత పోస్ట్