AP: కడప, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో
టీడీపీ ఘనవిజయం సాధించింది. కడప మేయర్ ఎన్నికలో
టీడీపీ అభ్యర్థి మట్లి సువర్ణ,
వైసీపీ అభ్యర్థి దీప్తిపై ఏకంగా 65,588 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అదేవిధంగా, విజయనగరం మేయర్ స్థానాన్ని
తెదేపా అభ్యర్థి అవనాపు భార్గవి 18,787 ఓట్ల మెజార్టీతో కైవసం చేసుకున్నారు.