బీసీల మద్దతు కోసం టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ

1861చూసినవారు
బీసీల మద్దతు కోసం టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ
AP: బీసీల మద్దతు కోసం టీడీపీ, వైసీపీ పార్టీలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టీడీపీ ప్రకటించగా, వైసీపీ కూడా తాము ఎక్కువ సీట్లు ఇస్తామని చెబుతోంది. బీసీలను ఆకట్టుకోవడానికి రెండు పార్టీలు సభలు నిర్వహిస్తున్నాయి. టీడీపీ నర్శీపట్నంలో 'బీసీ జయభేరీ' పేరుతో సభ నిర్వహించగా, వైసీపీ విశాఖలో 'బీసీ గర్జన' పేరుతో సభ నిర్వహించాలని నిర్ణయించింది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నిర్వహించిన 'బీసీ గర్జన' మంచి స్పందన తెచ్చిపెట్టింది. బీసీలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత పోస్ట్