AP: అర్నబ్ తుఫాన్‌తో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతో సహాయక చర్యలకు తెలంగాణ ముందుకొచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించిన అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ పునరుద్ధరణ చర్యల కోసం సహాయక బృందాలను ఏపీకి పంపించాలని ఆదేశాలు ఇచ్చారు.