ఆదోని పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత

31చూసినవారు
ఆదోని పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత
AP: కర్నూలు జిల్లా ఆదోనిలోని 38, 39 వార్డుల పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ ఏజెంట్లు లోపల లేరని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ నేతలు మధుసూదన్, మనోజ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే, వైఎస్సార్సీపీ ఏజెంట్లు లోపలే ఉన్నారని పోలీసులు వారికి స్పష్టం చేశారు. అనంతరం ఇరువర్గాల నేతలను అక్కడి నుంచి పంపించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రం వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్