AP: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేముల గ్రామపంచాయతీ నామినేషన్ కేంద్రం వద్ద బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్ దాఖలు చేయనివ్వకుండా డీఎస్పీ మురళి నాయక్ అడ్డుకుంటున్నారని
వైసీపీ నాయకులు వందల సంఖ్యలో కదిలివచ్చారు. అభ్యర్థులను తక్షణమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతించాలని డిమాండ్ చేస్తూ పోలీసులతో
వైసీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. దాంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.