వెదురుపావులూరు టోల్‌ ప్లాజా వద్ద ఉద్రిక్తత

22చూసినవారు
వెదురుపావులూరు టోల్‌ ప్లాజా వద్ద ఉద్రిక్తత
AP: కృష్ణా జిల్లా వెదురుపావులూరు టోల్‌ ప్లాజా వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏలూరు నుంచి గుంటూరు వైపు వెళ్లే ఆరు గేట్లకు అడ్డంగా 20 టిప్పర్‌ లారీలను డ్రైవర్లు నిలిపివేశారు. టోల్‌ రుసుము చెల్లించిన తర్వాతే లారీలను అనుమతిస్తామని సిబ్బంది చెప్పడంతో వివాదం తలెత్తింది. ప్రభుత్వ ప్రాజెక్టు కోసం మట్టి తరలిస్తున్నామని డ్రైవర్లు తెలిపారు. దీంతో గన్నవరం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ముందుగా టోల్‌ చెల్లించి, సంబంధిత సంస్థ నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేసుకోవాలని డ్రైవర్లకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్