AP: మార్కాపురం జిల్లా కనిగిరి, యర్రగొండపాలెం నామినేషన్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. కనిగిరిలో నిబంధనల ప్రకారం అభ్యర్థితో పాటు ఇద్దరినే లోపలికి అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో
వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులపై దాడికి యత్నించినట్లు సమాచారం. మరోవైపు యర్రగొండపాలెం నామినేషన్ కేంద్రం వద్ద
టీడీపీ,
వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాటకు దారితీసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.