AP: కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గంలోని అగడూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో
టీడీపీ కార్యకర్తలపై ప్రత్యర్థులు దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం హుటాహుటిన పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి తెలుసుకున్న బీటెక్ రవి ఆసుపత్రికి చేరుకుని, గాయపడిన బాధితులను పరామర్శించారు.