తాడిపత్రిలో ఉద్రిక్తత.. రెండు కార్లకు నిప్పు (వీడియో)

5చూసినవారు
AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేతలు రంగారెడ్డి, రాజుకు చెందిన రెండు కార్లకు దుండగులు నిప్పు పెట్టారు. ఇగుడూరు, సజ్జలదిన్నె గ్రామాలకు చెందిన నేతల కార్లు దగ్ధం అయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు కార్లకు నిప్పు పెట్టినట్లు సమాచారం. ఘటనాస్థలానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేరుకుని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్