AP: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన
వైసీపీ.. ఇప్పుడు 2029 ఎన్నికలపై అంతర్గతంగా చర్చిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీకి గణనీయమైన ఓటు బ్యాంకు ఉందని
వైసీపీ చెబుతున్నప్పటికీ, రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఆందోళన వ్యక్తమవుతోందనే చర్చ సాగుతోంది. పార్టీలో కొందరు సీనియర్ నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 2029 ఎన్నికల నాటికి బలమైన అభ్యర్థులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని
వైసీపీ ప్లాన్ చేస్తోంది.