AP: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కడపలో ఎంపీ అవినాష్ రెడ్డి,
వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే అనంతపురం, మాచర్ల, చంద్రగిరిలో మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్ రామిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.