AP: కర్నూలు జిల్లాలో ఉగ్ర కలకలం రేగింది. సికింద్రాబాద్కు చెందిన నూర్ మహమ్మద్ అనే ఉగ్రవాదిని ఐబీ (IB) అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. కర్నూలు శివార్లలోని గొందిపర్ల గ్రామంలో ఉన్న ఓ పరిశ్రమలో రహస్యంగా పనిచేస్తున్నట్లు గుర్తించి పక్కా సమాచారంతో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిని విచారణ నిమిత్తం హైదరాబాద్కు తరలించారు.