దూసుకొస్తున్న మురసు తుఫాన్‌

9చూసినవారు
దూసుకొస్తున్న మురసు తుఫాన్‌
AP: మురసు తుఫాన్‌ రాష్ట్రం వైపు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో వాయుగుండం తుఫాన్‌గా బలపడింది. ఏపీ వైపు వేగంగా తుఫాన్ దూసుకురావడంతో తీర ప్రాంతాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 20 కి.మీ వేగంతో తుఫాన్ ముందుకు కదులుతోంది. సోమవారానికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. ఎల్లుండి నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటనుందని అధికారులు చెబుతున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 100-120 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్