టీడీపీ నుంచి ఎంపీటీసీలుగా దంపతుల విజయం

12చూసినవారు
టీడీపీ నుంచి ఎంపీటీసీలుగా దంపతుల విజయం
AP: కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన దంపతులు విజయం సాధించారు. ప్రత్తిపాడు-2 స్థానం నుండి యాళ్ల జగదీశ్, ప్రత్తిపాడు-3 స్థానం నుండి ఆయన భార్య మంగాదేవి ఎంపీటీసీలుగా గెలుపొందారు. మరోవైపు, నెల్లూరు జిల్లాలోని మేకపాటి విక్రమ్ రెడ్డి స్వగ్రామమైన బ్రాహ్మణపల్లిలో కూడా టీడీపీ సత్తా చాటింది. ఇక్కడ ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుమతి 189 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, పసుపు జెండాను ఎగురవేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్