గిరిజనులకు తప్పని డోలి కష్టాలు (వీడియో)

2చూసినవారు
AP: గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో మరో ఘటన వెలుగుచూసింది. చిట్టంపాడు గ్రామానికి చెందిన గిరిజన మహిళ కేరంగి కుమారికి శనివారం పురిటినొప్పులు వచ్చాయి. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆమెను డోలిలో భర్త, కుటుంబసభ్యులు మోసుకెళ్లారు. సుమారు 10 కిలోమీటర్లు వరకు డోలిలో తీసుకెళ్లారు. చిట్టంపాడు నుంచి శేనగపాడు గ్రామం వరకు డోలిలో తరలించి.. అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్