గంటాను ఢీ కొంటానంటున్న గుడివాడ?

3చూసినవారు
గంటాను ఢీ కొంటానంటున్న గుడివాడ?
AP: భీమిలీ నియోజకవర్గంపై పలు రాజకీయ పార్టీలు ఆసక్తి చూపుతున్నాయి. గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ సీటును వైఎస్సార్‌సీపీ కూడా గెలుచుకోవాలని భావిస్తోంది. భీమిలీ వైఎస్సార్‌సీపీ ఇంచార్జి చిన్న శ్రీను పార్టీని వీడి వెళ్లడంతో కొత్త ఇంచార్జి నియామకం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ సీటుపై ఆసక్తి చూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా భీమిలీ నుంచి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. అయితే, గుడివాడ అమర్నాథ్, గంటా శ్రీనివాసరావును ఢీ కొట్టి విజయం సాధిస్తానని పలు ప్రెస్‌మీట్‌లలో పేర్కొంటున్నారు. ఈ పరిణామాలతో భీమిలీలో రాజకీయ వేడి రాజుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్