ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాత్రి 10 గంటల వరకు కూటమి 456 జడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించగా.. మరో 39 చోట్ల ఆధిక్యంలో ఉంది.
వైసీపీ 48 స్థానాలను కైవసం చేసుకుని, మరో 11 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. ఇతరులు నాలుగు స్థానాల్లో గెలుపొందారు. ఎంపీటీసీ స్థానాల్లో కూటమి 7,026 చోట్ల,
వైసీపీ 1,524 స్థానాల్లో విజయం సాధించాయి. ఇతరులు 261 స్థానాలను దక్కించుకున్నారు.