AP: ఏపీలోని వివిధ జిల్లాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల
ఫలితాలు వెలువడ్డాయి. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వసనాడులో TDP అభ్యర్థి సుబ్బలక్ష్మి విజయం సాధించారు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం అప్పలంపేట సర్పంచ్‌గా YCP మద్దతు అభ్యర్థి వారాడ నీలవేణి 22 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కుంతేసు పంచాయతీలో TDP అభ్యర్థి మండంగి సరస్వతి 217 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా, కర్నూలు జిల్లా ఆదోని 1 మండలం కొత్తూరులో YCP మద్దతుదారు గొల్ల శంకర్ 32 ఓట్ల మెజార్టీతో విజయాన్ని దక్కించుకున్నారు.