AP: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ఎంవీఎస్ సర్జికల్ అండ్ మెటర్నిటీ నర్సింగ్ హోమ్‌ను అధికారులు సీజ్ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వైద్య సేవలు అందించరాదని ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్పత్రిలో డెలివరీ అనంతరం దీప్తి అనే మహిళ మృతి చెందిందిన విషయం తెలిసిందే. వైద్యుల నిర్లక్ష్యమే తన భార్య మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారం రోజుల క్రితం ఇదే ఆస్పత్రిలో ఆపరేషన్ వికటించి మరో మహిళ మృతి చెందినట్లు సమాచారం.