AP: కర్నూలు జిల్లాలో జరిగిన దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. ఉత్సవాల రోజున పోతురాజు అనే వ్యక్తి మరణించగా, తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న పరమేష్ మరియు ఉరురుకుందు ఆదివారం మృతి చెందారు. దీంతో ఈ ఉత్సవాల్లో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా నేడు ఉరురుకుందు తుదిశ్వాస విడిచారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.